Our Health

ఫోమో ( FOMO ) నివారించుకోవడం ఎలా ?

In Our Health on ఫిబ్రవరి 2, 2025 at 9:53 సా.

మునుపటి టపాలో , ఫోమో అంటే ఏంటో , దానికి కారణాలు ఏమిటో , తెలుసుకుని , దాని నివారణోపాయాలు కూడా కొన్ని తెలుసుకున్నాం కదా !

ఇప్పుడు , మిగతా నివారణోపాయాలు కూడా తెలుసుకుందాం !

5. మీ నిజజీవితానికి దగ్గరగా అంటే ఊహా ప్రపంచం లో కాక , మీ యదార్ధ  జీవిత పరిస్థితి ఏమిటో బేరీజు వేసుకుని , దానికి దగ్గర గా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి ! ఇతరులు సిరులలో తల తూగుతున్నారన్న భ్రమ లో తాము కూడా అదే జీవనశైలి ఆచరిద్దామనే అపోహలు మాని , తమ తమ లక్ష్యాలను ఎట్లా చేరుకోవాలో , అందుకు తాము చేయవలసిన కర్తవ్యం ఏమిటో నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి ! ఒక వేళ  ఇతరులతో పోల్చుకునేట్టయితే , వారిలో ఉన్న మంచి లక్షణాలను పరిశీలించి , వాటిని ఆచరణలో పెట్టడానికి పూనుకోవాలి , అంటే పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవాలి ! 

6. డిస్ట్రాక్షన్  టెక్నిక్స్  ( distraction technics ) అంటే మనసు దారి మళ్లించడం ! ఈ  చర్య అనుకున్నంత తేలిక కాదు ! కానీ  అసాధ్యం మాత్రం కాదు ! అదేపనిగా , ఒక వ్యసనం మాదిరిగా , నిరంతరం  ఫోను పట్టుకు కూర్చోవడం మాని , వారు కోల్పోతున్నదేమిటో తెలుసుకోవాలి !తమ కుటుంబ సభ్యులతోనో , బంధు మిత్రులతోనో , సమయాన్ని గడపడానికి  ప్రయత్నం చేయాలి , లేదా  క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కానీ ,కొంత దూరం నడవడం కానీ చేయ వచ్చు ! 

7. బలమైన బంధాలు ఏర్పరుచుకోవడం ! ( Strong relationships ) : తాము నివసించే ప్రదేశం లో , తమ చుట్టూ ఉన్నవారితోనూ , తమ సన్నిహితులతోనూ ఆరోగ్య కరమైన సంబంధాలు ఏర్పరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ! అంటే తాము ఏర్పరుచుకునే సంబంధాలు ఇంటర్నెట్ ద్వారా మనుషులతో కాక , వ్యక్తిగతంగా , వారు చూడ గలుగుతున్న యదార్ధ వ్యక్తులతో ఏర్పరుచుకోవాలి ! కొత్త వ్యక్తులతో ఫోను లో ఏర్పరుచుకుని సంబంధాలు ఏ  ఆధారాలతో ఏర్పరుచుకుంటున్నారో పరిశీలించుకోవాలి ! కృత్రిమ మేధ  ద్వారా , ఈ రోజుల్లో అనేక రకాలైన మోసాలు జరుగుతున్నాయి !

8. ‘ నీ గమ్యం మరువకు బాటసారీ ! ‘ : ప్రతి ఒక్కరూ , వయసు తో నిమిత్తం లేకుండా , తమ తమ లక్ష్యాలనూ , గమ్యాలనూ నిర్దేశించుకుని , వాటిని చేరుకోవడానికి నిరంతరం కృషి చేస్తూ ఉండాలి !  ప్రత్యేకించి ,తమ  అత్యంత విలువైన ‘ సమయాన్ని ‘ ఏ ఇతర మానవులు కానీ , వస్తువులు కానీ వృధా చేయకుండా నివారించుకోవాలి ! ఎందుకంటే , గమ్యం చేరుకోవడానికి , కాలయాపన చేసే ఏ ఇతర పనీ , తమకు ఉపయోగపడదు ! అంతే కాక , తమ మనసులో  ఎప్పుడూ ,తమ ప్రత్యేకమైన లక్ష్యాలూ , గమ్యాలూ తమకే తెలుసుకనుక ! 

9. క్వాంటిటీ కన్నా క్వాలిటీ  ముఖ్యమని తెలుసుకోండి ! అంటే , నాలుగు గంటలు ఫోనులో ‘ సుత్తి కొట్టటడం ‘ కానీ ‘ సుత్తి కొట్టించుకోవడం’ కానీ చేసే బదులు ఆ సమయం తమకు ఎంత ఉపయోగపడిందో కూడా తెలుసుకుంటే మంచిది ! ఫోను లో ఇంటరాక్ట్ అవకపోతే చాలా కోల్పోతామనే భావన బదులు , తాము  ఎంత వరకు లాభపడుతున్నామో , తమ తమ లక్ష్యాలు ఎంతవరకు కుంటు పడుతున్నాయో  కూడా ఆత్మ విమర్శ చేసుకోవడం శ్రేయస్కరం !

మిగతా మార్పులు తరువాతి టపాలో తెలుసుకుందాం !

ఈలోగా మీ అభిప్రాయాలను తెలుపండి !

FOMO ( ఫోమో ) అంటే ఏమిటి ? దానిని  నివారించుకోవడం ఎలా ?!

In Our Health on జనవరి 20, 2025 at 9:52 సా.

ఫియర్ అఫ్ మిస్సింగ్ అవుట్ ( FOMO = Fear Of Missing Out ):

FOMO ఉన్న వారి ప్రవర్తన ఈ క్రింది విధం గా ఉండవచ్చు !

1. అదే పని గా సోషల్ మీడియా సైట్లను వెదకటం : అంటే రోజులో ఓ అరగంటో  గంటో కాకుండా అతిగా ఫోను ఉపయోగిస్తూ ఎక్కువ సమయాన్ని వృధా చేసుకోవడం !
2.ఇతరులు వారి వారి కార్యక్రమాలనూ, సాధించిన విజయాలనూ వివరిస్తూ పెట్టే  పోస్టులు చూస్తూ తాము మాత్రం  విచారం గా, ఆందోళన చెందడం !
3. ఇతరులనుంచి వచ్చిన ప్రతి ఆహ్వానాన్నీ , వీలైనా కాకున్నా , మిస్సవ్వ కూడదనే ఉద్దేశం తో  అంగీకరించడం !
4. గ్రూపులలోనూ , విందు వినోదాలలోనూ పాల్గొన లేక పొతే , నిరాశా నిస్పృహ లకు లోనవడం !
5. ఇతరులు సాధించిన దానితో తమను పోల్చుకుని , తాము తమ జీవితం లో తక్కువ సాధించామని ఆత్మ న్యూనతా భావం తో కుంగిపోవడం !
6. అదేపనిగా  తమ కార్యక్రమాలను కానీ , తమ దిన చర్య కానీ ఇతరులు ఏ రకంగా అంచనా వేస్తారో అని ఆందోళన చెందడం !
7.తమ ప్రస్తుతాన్ని ఆస్వాదించ లేక పోవడం !  ఆలోచనలన్నీ ఇంకో సమయం లో ఇంకో స్థలం లో జరిగే  సంఘటనలలోనూ , విందు వినోదాలలోనూ పాల్గొనలేక పోతున్నాననే విషయాల మీదనే తిరగడం ! ( preoccupation ).

పరిణామాలు :  FOMO  వల్ల  మానసిక వత్తిడి , ఆత్మ విశ్వాసం లోపించి , అదేపని గా వివిధ  సోషల్ మీడియా వస్తువులు ( అంటే స్మార్ట్ ఫోన్, లేదా మొబైల్ కానీ , PC లేదా లాప్ టాప్ కానీ , టాబ్లెట్ ను కానీ నిరంతరం  సంధానం అయి ఉండాలనే తపన పెరుగుతుంది ! ఈ తపన ఎంతగా ఏర్పడుతుందంటే , వారి వారి దైనందిన కార్యక్రమాలు మందగించేలా అంటే , విద్యార్థులు చదువుకు ఎక్కువ సమయం కేటాయించలేక పోవడం , లేదా వారికి ఏకాగ్రత లోపించి , సరిగా చదవక , పరీక్షలలోనూ , తద్వారా చదువులోనూ వెనుక బడడం , అలాగే ఉద్యోగస్తులు , అంతకు ముందులా తమ విధులు నిర్వర్తించలేక , పై అధికారుల విమర్శలూ , వార్నింగ్ లూ పొందడం. 

పరిష్కారం ఏమిటి ?

ఫోమో  వ్యసనాన్ని వదులుకోవచ్చు !
అందుకు ముఖ్యంగా కావలసినది, తమ సమస్యను ఆత్మావలోకనం చేసుకుని  దానిని ఒక సమస్యగా అంగీకరించడం. తరువాత తమలో మార్పుకోసం  మానసిక స్థైర్యం పెంపొందించుకోవడం !  అంటే గుండె దిటవు చేసుకుని  కొన్ని మార్పులను క్రమం తప్పకుండా అనుసరించాలి  ! క్రమేణా ఆ మార్పులు నిత్య జీవితం లో చోటు చేసుకుని ఫోమో నుంచి బయట పడేస్తాయి ! జీవితాలని ఆనంద మయం చేస్తాయి !

ఆ మార్పులు ఏమిటో చూద్దాం ఇప్పుడు క్లుప్తంగా  !

1.  సోషల్ మీడియా ను సాధ్యమైనంత వరకూ తగ్గించుకోవడం !
ఒక నిర్ణీత సమయాన్ని మాత్రమే సోషల్ మీడియాకు కేటాయించాలి ! మిగతా సమయం లో స్మార్ట్ ఫోన్ గురించి కానీ , సోషల్ మీడియా గురించి కానీ ఆలోచించక , తమ తమ పనులూ బాధ్యతలూ నిర్వర్తించుకోవాలి ! అంటే విద్యార్థులు చదువు మీదా , ఉద్యోగస్తులు తమ వృత్తి ధర్మాన్నీ మరచి పోకుండా , బాధ్యత గా  ప్రవర్తించాలి . మొబైల్ ఫోన్ వాడడం అనివార్యమవుతే , రోజూ ఒక నిర్ణీత సమయాన్ని మాత్రమే దానిని వాడి, మిగతా సమయం లో కేవలం అత్యవసర కాల్స్ మాత్రమే అంటే ఎమర్జెన్సీ కాల్స్ మాత్రమే రిసీవ్ చేసుకుని మాట్లాడడమో , లేదా టెక్స్ట్ చేయడమో చేయాలి ! ఎందుకంటే  ప్రతివారికీ ఒక రోజులో ఉండే సమయం కేవలం 24 గంటలు మాత్రమే ! ఆ అమూల్యమైన సమయం ప్రతి ఒక్కరి హక్కు , ఆ సమయాన్ని  హరించే మిగతా ఏ కార్య క్రమాలూ మీరు అలవాటు చేసుకోకూడదు ! ఒక వేళ  తెలిసో తెలియకో అలవాటు అవుతే , దానిని మొగ్గ లోనే తుంచి వేయాలి , అంటే మొదటిలోనే ఆ అలవాటు నుంచి బయట బడే ప్రయత్నం చేయాలి !
అంటే ఫోమో మానసిక దౌర్బల్యం నుంచి బయట పడే మార్గం మానసిక స్థైర్యం తో నే సాధించాలి  ! ముల్లు ను ముల్లు తోనే తీసినట్టుగా !
2. మైండ్ ఫుల్ నెస్ ను అభ్యాసం చేయడం : అంటే  మీరు ఒక రోజులో చేయ వలసిన పనులను నిష్ఠ , నియమాలతో పూర్తి ఏకాగ్రత తో , ఏ ఇతర అవాంతరాలు కల్పించుకోకుండా చేయడం అలవాటు చేసుకోవాలి !
ఈ మైండ్ ఫుల్ నెస్ గురించి వివరం గా వచ్చే టపాలో తెలుసుకుందాం !
3. దిన చర్య స్వీయ భవిత మీద , తమ , తమ విలువలు నిర్దిష్టం గా నిర్ణయించుకుని , అందుకై తదేక దీక్ష తో , ఏకాగ్రత తో కృషి చేయ వలసిన అవశ్యం యువతకు ఉండాలి !

కేవలం , మిగతా వారు ఏమేం చేస్తున్నారో , ఆ చర్యలు తాము ఎంత మిస్సవుతున్నామో అని కలత చెందుతూ కాలక్షేపం చేస్తే , తమ తమ లక్ష్యాలను చేరుకోవడం లో విపరీతం గా కాల యాపన జరిగి , చివరకు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను కూడా చేరుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు ! అప్పుడు తమ విలువైన కాలాన్ని ఎట్లా వృధా చేసుకున్నారో అని విచార పడినా కూడా ఫలితం ఉండదు కదా ! ప్రతి రోజూ , తమ తమ భవిత ఉజ్వలంగా ఉండాలంటే చేయవలసినవి మననం చేస్తుకుంటూ , అందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించు కుంటూ ఉండడం  వల్ల   ఎంతో తృప్తీ ,  లాభం ఉంటుంది , కేవలం ఇతరుల కార్యక్రమాలను పోల్చుకుంటూ  కాల హరణం చేసేకన్నా !
4. కృతజ్ఞతా భావాలు పెంపొందించుకోవడం ( gratitude ): మనకు లేనిదానికోసం బాధ పడడం కన్నా , మనకు ఉన్న పాజిటివ్ ( అంటే సకారాత్మక ) లక్షణాలూ , బలాలూ ( strengths ) ఒక క్రమపద్ధతిలో అండ్ రోజువారీగా బేరీజు వేసుకుంటూ పురోగమనం  చెందుతూ ఉండాలి !

మిగతా మార్పులు తరువాతి టపాలో తెలుసుకుందాం !

ఈలోగా మీ అభిప్రాయాలను తెలుపండి !

వ్యామోహం ( infatuation ) , క్రష్ ( crush ) ,  ఆకర్షణ (attraction )  , ప్రేమ ( love ) లకు తేడా ఏంటి ?! – 1.

In Our Health on ఫిబ్రవరి 24, 2022 at 9:39 సా.

 వ్యామోహం ( infatuation ) , క్రష్ ( crush ) ,  ఆకర్షణ (attraction )  , ప్రేమ ( love ) లకు తేడా ఏంటి ?! – 1.

1.  వ్యామోహం ( infatuation ) :

నీలిమ ఇంటర్మీడియేట్  విద్యార్థిని . క్రమం తప్పకుండా కాలేజీ కి వెళుతూ , 

శ్రద్ధగా చదువుకుంటుంది !  ప్రత్యేకించి తన ఫిజిక్స్ లెక్చరర్  క్లాస్ లో ఇంకా  శ్రద్ధ గా !

ఎందుకంటే,  ఆ లెక్చరర్   ఎప్పుడూ,  శుభ్రమైన , మడతలు లేని బట్టలు వేసుకుని , 

విద్యార్ధులందరితోనూ , చలాకీ గా మాట్లాడుతూ వారి సందేహాలు తీరుస్తూ ఉంటాడు ! 

కొన్ని సార్లు నీలిమ దగ్గరగా వచ్చి ఆమె కళ్ళలో చూస్తూ , సబ్జెక్ట్  లో సందేహాలు తీరుస్తాడు ! 

మిగతా చాలా మంది బాయ్స్ కన్నా , నీలిమకు ఆ లెక్చరర్ అంటే  విపరీతమైన వ్యామోహం ఏర్పడింది ! 

తరచూ  అతడి రూపం  తన మనసులో మెదులుతూ ఉంటుంది , ఇంట్లో ఉన్నా కూడా !

అతని మీద  ఎంతో ఆరాధనా భావం కలుగుతూ ఉంది , 

అతడి  సమీపం లో ఎంతో  వెచ్చదనం కలిగి , అభద్రతా భావం తొలగి పోతుంది ! 

అలాగని తాను తన చదువును అశ్రద్ధ చెయ్యట్లేదు ! ఏకాగ్రత తో  చదువుకుంటూంది !

ఆ లెక్చరర్ అంటే నీలిమకు వ్యామోహం ఏర్పడింది , యదాలాపం గా అతడిని తలుచుకోగానే కామోత్తేజం కలుగుతుంది !  తాను ఆ లెక్చరర్ ను  ప్రేమించడం లేదు, అని తనకు తానూ సర్ది చెప్పుకుంటుంది ! 

కానీ వ్యామోహాన్ని అనేకమంది అనేక రకాలు గా నిర్వచించారు ! 

కొందరు , ఇరువురి మధ్య ప్రేమ పుష్పం వికసించే సమయంలో మొగ్గ వంటిదే ‘ వ్యామోహం ‘ అని అన్నారు ! 

ఇంకో సైకాలజిస్ట్ ,  ఇరువురి మధ్య గాఢమైన అన్యోన్యత పెరిగే ముందు దశ అని అన్నాడు ! 

ఒక సెక్స్ సైకాలజిస్ట్ , ‘ ఎదుటి వ్యక్తి  సమీపం లో కలిగే నూతనోత్తేజం , ఇంకా ఒక పిసరు కామ వాంఛ కూడా ‘  అని ప్రబోధించాడు ! 

ఇక హార్మోనుల పరం గా చూస్తే , ఈ దశలో ‘ డోపమిన్  ‘ అనే హార్మోను ఆమె లో ఉవ్వెత్తున ఎగసి పడుతుంది ! 

బ్రౌన్ మహాశయుడు , ఈ వ్యామోహాన్ని  మూడు రకాలు గా తేల్చాడు. 

మొదటి రకం లో ‘ ఎదుటి వ్యక్తి మీద పిచ్చి ఆకర్షణ ఏర్పడుతుంది ! కానీ వారి మనసు వారి వశం లోనే ఉంటుంది ! 

రెండో రకం లో ,  వారి మనసు వారి వశం తప్పిపోతోంది ! తాము వ్యామోహ పడిన వ్యక్తి  ఆజ్ఞలు శిరసావహిస్తారు , ముందూ వెనుకా ఆలోచించకుండా ! 

ఇక మూడో రకమైన వ్యామోహం లో , తాము వ్యామోహపడిన వ్యక్తి  చెప్పిన ప్రతి విషయమూ వారికి వేద వాక్కు అయి , దానిని ఆచరణలో పెట్టి , తీవ్రమైన ప్రతికూల పరిణామాలను కూడా ఎదుర్కొంటారు ! అంటే , ఈ దశలో వారు వారికి ఏది మంచో చెడో  ఆలోచించుకునే  విచక్షణా జ్ఞానాన్ని కూడా కోల్పోతారు , నష్టపోతూ ఉంటారు ! 

2. క్రష్  ( crush ) :

ఈ రోజుల్లో చాలా మంది యువతీ యువకుల్లో వినబడే మాట ! 

స్నిగ్ధ  గ్రాడ్యుయేషన్ రెండో సంవత్సరం చదువుతూ ఉంది ! చాలా మంది ఆమె క్లాసు లో 

ఉన్న యువకులకు  ఆమె అంటే క్రష్ ! అందుకు కారణం లేకపోలేదు !

లేత చాకోలెట్ రంగులో నిగనిగ లాడే మేని వర్చస్సు , చిక్కటి నీలి మేఘాల ల  లాంటి అలల కురులు, తల తిప్పకుండా చూస్తూ ఉండాలనిపించే కళ్ళూ , ముఖమూ , పెదవులూ , 

ఉలి తో చెక్కినట్టుండే  వక్షస్థలం , సన్నటి నడుమూ , ఎప్పుడూ నవ్వుతూ ఉండే ముఖమూ !

తరచూ సగం జారీ ఉండే పైట , కేవలం యాధృచ్చికమో  , లేదా లోపలి అందాలు కనిపించాలని , తానే  జారవిడుస్తుందో తెలుసుకోలేక , కుర్రాళ్లందరూ అయోమయం తో వెర్రెత్తి పోతారు ! 

మరి ఈ క్రష్ ( crush ) కు తెలుగులో సరైన అర్ధం కోసం చూస్తే ‘ నలిపివేయడం ‘ అని గూగుల్ లో కనిపించింది !  ఈ తెలుగు అర్ధం ఇక్కడ ఏమాత్రం వర్తించదు ! 

ఈ క్రష్  అంటే , విపరీతమైన భౌతిక ఆకర్షణకు లోనై ,భావోద్రేకం , కామోత్తేజం , ఇంకా  కామ పరమైన ఆలోచనలు కూడా కలగడం ! 

కొన్ని సార్లు  ఆ ఆకర్షణకు లోనైన  వ్యక్తి , క్రష్  ఉన్న అవతలి వ్యక్తి తో ప్రేమలో కూడా పడ వచ్చు , కానీ అరుదు గా మాత్రమే  అది గాఢమైన ప్రేమ గా మారుతుంది ! 

మిగతా సంగతులు వచ్చే టపాలో ! ఈ టపా మీద  మీ అభిప్రాయాలు ఏమిటో  ?!